తెలంగాణ వీణ , జాతీయం : నిత్యం సరిహద్దు గొడవలతో ఎడ మోహం, పెడ మోహంగా ఉండే భారత్, పాకిస్థాన్ మధ్య మరో వివాదం మొదలయ్యేలా ఉంది. తాజాగా భారత్‌పై పాకిస్థాన్ చేసిన సంచలన ఆరోపణలే దీనికి కారణం. శుక్రవారం తమ దేశంలో జరిగిన రెండు ఆత్మాహుతి పేలుళ్లలో భారత గూఢచార సంస్థ ప్రమేయం ఉందని శనివారం పాకిస్థాన్ ఆరోపించింది. ఈ మేరకు పాకిస్థాన్ అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో శనివారం మాట్లాడుతూ.. ఆత్మాహుతి దాడిలో భారతదేశ పరిశోధన, విశ్లేషణ విభాగం ప్రమేయం ఉందని పేర్కొన్నారు. “సివిల్, మిలిటరీ, అన్ని ఇతర సంస్థలు సంయుక్తంగా మస్తుంగ్ ఆత్మాహుతి బాంబు దాడిలో పాల్గొన్న అంశాలకు వ్యతిరేకంగా సమ్మె చేస్తాయి. ఆత్మాహుతి దాడిలో ప్రమేయం ఉంది” అని పాకిస్తాన్ మంత్రి ఆరోపించారు. పాక్ మంత్రి చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు రానున్న కాలంలో రెండు దేశాల పెను దుమారాన్ని సృష్టించే అవకాశాలున్నాయి. మరోవైపు ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడిన వ్యక్తి డీఎన్‌ఎను విశ్లేషించడానికి ల్యాబ్‌కు పంపించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించేందుకు పోలీసులు శనివారం నివేదికను సమర్పించారు. ఇక శుక్రవారం జరిగిన రెండు బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య 65కు చేరింది.