తెలంగాణ వీణ , క్రీడలు : మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అంచనాలను అందుకోలేకపోయింది. కెప్టెన్ స్మృతి మందానతో పాటు స్టార్ ప్లేయర్స్ విఫలమవ్వడంతో రెండంటే రెండే విజయాలు సాధించింది. దాంతో, వచ్చే సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కోసం ఇప్పటినుంచే ఆర్సీబీ యాజయాన్యం సన్నాహకాలు మొదలెట్టింది.
మహిళల బిగ్‌బాష్ లీగ్ కోచ్‌గా విజయవంతమైన ల్యూక్ విలియమ్స్‌ను హెడ్‌కోచ్‌గా నియమించింది. ఐపీఎల్ 16వ సీజన్‌లో పురుషుల జట్టు ప్లే ఆఫ్స్ చేరకపోవడంతో కోచింగ్ సిబ్బందిని మార్చింది.