తెలంగాణ వీణ , క్రీడలు :చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్కు మరో బంగారు పతకం దక్కింది. ట్రాప్ మెన్స్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు అదరగొట్టారు. ఆదివారం ఉదయం జరిగిన ట్రాప్-50 మెన్స్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు కైనాన్ చెనాయ్, జోరావర్ సింగ్, పృథ్వీరాజ్ తొండైమాన్ 361 పాయింట్ల రికార్డు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.
మరోవైపు మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు మనీషా కేర్, రాజేశ్వరి కుమారి, ప్రీతి రజక్ 337 పాయింట్లు స్కోర్ చేసి రజత పతకం సాధించారు.