తెలంగాణ వీణ , క్రీడలు : చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం దక్కింది. భారత గోల్ఫర్ అదితి అశోక్ మహిళల వ్యక్తిగత విభాగంలో సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో ఆసియా గేమ్స్‌లో భారత్‌కి పతకం తెచ్చిన మొట్టమొదటి మహిళా గోల్ఫర్గా అదితి అశోక్ రికార్డు క్రియేట్ చేసింది. అంతకుముందు 1982లో లక్ష్మనన్ సింగ్, భారత్‌కి గోల్ఫ్‌లో స్వర్ణం సాధించాడు. 41 ఏళ్ల తర్వాత ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కి గోల్ఫ్ ఈవెంట్లో పతకం రావడం ఇదే మొదటిసారి.
ఇదిలా ఉంటే.. ఈ నెల 24న మొదలైన ఆసియా క్రీడల్లో ఆది నుంచి భారత క్రీడాకారులు గతం కంటే మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. షూటింగ్, రోయింగ్ విభాగాల్లో ఎక్కువగా పతకాలు వచ్చాయి. మహిళల క్రికెట్లో కూడా భారత్‌కు బంగారు పతకం దక్కింది. ఈక్వెస్ట్రియన్‌లో కూడా దాదాపు 41 ఏళ్ల తర్వాత భారత్ బంగారు పతకం నెగ్గి చరిత్ర సృష్టించింది.