తెలంగాణ వీణ , సినిమా : బిగ్‌బాస్ సీజన్-7 నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్లు వాడి వేడిగా సాగాయి. 14మంది కంటెస్టెంట్‌లతో ప్రారంభమైన ఏడో సీజన్‌లో ఇప్పటివరకు ముగ్గురు ఎలిమినేట్ అవగా.. ప్రస్తుతం 11మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లో ఉన్నారు. అందులో శివాజీ, సందీప్ మాస్టర్, శోభ, పల్లవి ప్రశాంత్‌లు హౌజ్ మేట్‌లుగా ఉండటంతో నామినేషన్‌ల లెక్కలోకి రారు. ఇక మిగిలిన ఏడుగురు శుభ శ్రీ, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ, రతిక రోజ్, ప్రియాంక జైన్, అమర్ దీప్ చౌదరిలు నామినేట్ అయ్యారు. ఓటింగ్ పోల్స్ ప్రకారం రతికకు తక్కువగా ఓట్లచ్చాయి. దాంతో టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన రతిక నాలుగోవారం ఎలిమినేట్ అయింది.
హౌజ్‌లోకి వెళ్లిన మెదట్లో రతిక చురకుగానే ఉండేది. గేమ్‌లు, టాస్క్‌లు గట్రా కూడా బాగా ఆడేది. అప్పుడే సింగర్ రాహుల్‌తో దిగిన ఫోటోలు బయటకు రావడం.. ఎక్స్‌బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడని రతిక చెబుతుందని శుభ శ్రీ నామినేషన్‌లో మాట్లాడటం, అదే టైమ్‌లో రాహుల్ ఇన్‌స్టాలో ఆమెను ఉద్దేశించి పోస్ట్ పెట్టడం వంటివి రతికపై నెగెటీవ్ వైబ్స్ తీసుకొచ్చాయి. దానికి తోడు హౌజ్‌లో లవ్ ట్రాక్స్ నడపడం కూడా ఆమెపై ప్రతీకూల ప్రభావం ఏర్పడింది. పల్లవి ప్రశాంత్‌కు వెన్నుపోటు పొడవడం, యావర్‌ను కంటెండర్‌గా, హౌజ్‌మేట్‌గా చూడాలని అతనికి చెప్పి.. కన్ఫెషన్ రూమ్‌లో మాత్రం వ్యతిరేకంగా మాట్లాడటం.. ఇలా అవసరానికి మాత్రమే వాడుకునే లక్షణాలు ఉండటం వంటి పలుకారణాలతో రతిక ఎలిమినేట్ అయింది.