తెలంగాణ వీణ , సినిమా : చిన్న సినిమాగా రిలీజై ఊహించని రేంజ్‌లో కోట్లు కొల్లగొట్టింది బేబి సినిమా. వంద కోట్ల సమీపంలో ఆగి.. కంటెంట్‌తో వస్తే కలెక్షన్‌లు అడ్డేది అని ప్రూవ్ చేసింది. నిర్మాత ఎస్‌కేఎన్‌కు ఈ సినిమా కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది. బేబి సినిమా సంచలనం విజయం విజయం సాధించడంతో SKN.. దర్శకుడు సాయి రాజేష్‌కు కాస్ట్‌లీ కారును గిఫ్టుగా ఇచ్చాడు. బ్రాండ్ న్యూ మోడల్ బెంజ్ కారుని బహుమతిగా ఇచ్చాడు. ఈ కారు ధర కోటికి పైమాటే. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా బేబి రిలీజ్‌కు ముందు కూడా SKN.. సాయి రాజేష్‌కు పాతిక లక్షల విలువ చేసే MG కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇలా ఒక దర్శకుడికి రెండు సార్లు గిఫ్ట్ ఇవ్వడం బహుశా ఇదే తొలిసరేమో.