తెలంగాణ వీణ , క్రీడలు : ఆసియా క్రీడలు 2023లో 7వ రోజు భారత్ పతకాల వేట ప్రారంభమైంది. షూటింగ్‌లో మరోసారి సత్తా చాటిన భారత్ ఖాతాలో సిల్వర్ మెడల్ చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ భారత్ ద్వయం సరబ్‌జోత్ సింగ్, దివ్య తాడిగోల్ రజత పతకం గెలిచారు. ఫైనల్ పోరులో 14 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన భారత జోడి రజతంతో సరిపెట్టుకుంది. 16 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచిన బోవెన్ జాంగ్ రాంక్సిన్ జియాంగ్‌లతో కూడిన చైనా జోడి బంగారు పతకం కైవసం చేసుకుంది. 7వ రోజు భారత్‌కు ఇదే తొలి పతకం. మొత్తంగా భారత్‌కు ఇది 34వ పతకం. ఇందులో షూటింగ్‌లోనే 19 పతకాలు రావడం గమనార్హం. అందులో 6 గోల్డ్, 8 సిల్వర్, 5 కాంస్య పతకాలున్నాయి.