తెలంగాణ వీణ , క్రీడలు : చైనా వేదికగా జరగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. శనివారం మరో గోల్డ్ మెడల్ భారత్ ఖాతాలో వచ్చి చేరింది. టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న, రుతుజా జోడీ పసిడి పతకం కైవసం చేసుకుంది.
శనివారం జరిగిన ఫైనల్లో 2-6, 6-3, 10-4 తేడాతో థైపీ జోడీని బోపన్న, రుతుజా ద్వయం ఓడించింది. కాగా ఇది భారత్‌కు 9వ గోల్డ్‌మెడల్ కావడం గమానార్హం. ఇక ఈ ఆసియా క్రీడల్లో 35 పతకాలతో భారత్ ఐదో స్ధానంలో కొనసాగుతోంది