Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

కేజీఎఫ్ .. ఛాప్టర్‌-3

Must read

తెలంగాణ వీణ , సినిమా :

తాజాగా హోంబలే ఫిల్మ్స్‌కు చెందిన అధికార ప్రతినిధి ‘కేజీఎఫ్’ మూడవ భాగం గురించి కొత్త అప్‌డేట్‌ చెప్పారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్- 3 మూవీ 2025లో విడుదల కానుందని ఆయన తెలిపారు. ఈ సినిమా నిర్మాణ పనులు 2023లోనే ప్రారంభమవుతాయని, ఇదే విషయాన్ని డిసెంబర్‌ 21న హోమ్‌బలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. ఇక ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు​ 2024లో ప్రారంభించి..  2025 కల్లా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుందని సమాచారం.

కేజీఎఫ్‌- ఛాప్టర్‌ 2  ఎండింగ్​లో పార్ట్‌-​ 3 ఉంటుందని దర్శకుడు ప్రకటించారు. అందుకే సినిమా కూడా కన్​క్లూజన్​ లేకుండా వదిలిపెట్టడం వల్ల అభిమానులు కూడా ఈ చిత్రానికి త్వరలోనే సీక్వెల్ వస్తుందని అనుకున్నారు. కానీ అటు ప్రోడక్షన్​ హౌస్​ గానీ ఇటు హీరో గానీ ఎటువంటి అప్​డేట్​ను షేర్​ చేయలేదు. ప్రశాంత్​ నీల్ కూడా ప్రభాస్​తో ‘సలార్’ సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీ అయిపోయారు. యష్‌ ఇప్పటి వరకు తన నుంచి మరో సినిమా ప్రకటన కూడా చేయలేదు. దీంతో ఈ మూవీ అప్​డేట్ గురించి ఎక్కడా ప్రచారంలోకి రాలేదు. ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారంతో కేజీఎఫ్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషి అవుతున్నారు.​​

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you