తెలంగాణ వీణ , సినిమా : అగ్ర హీరో ప్రభాస్ ప్రస్తుతం విదేశీ టూర్‌లో ఉన్నారు. అక్కడే ఆయన మోకాలికి సర్జరీ పూర్తయిందని, నెల రోజుల విశ్రాంతి అనంతరం ఇండియాకు రాబోతున్నాడని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ప్రభాస్ మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. ‘బాహుబలి’ షూటింగ్ సమయంలో చేసిన యాక్షన్ ఘట్టాల కారణంగా ఆయన మోకాలి నొప్పి బారిన పడ్డారు. గత కొద్ది నెలలుగా నొప్పి తీవ్రతరం కావడంతో ఆయన సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కీ 2898’ చిత్రంతో పాటు మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్స్‌కు కాస్త విరామం తీసుకొని ఆయన ఇటీవలే యూరప్ వెళ్లారు. అక్టోబర్ నెలాఖరులో ప్రభాస్ ఇండియాకు వస్తారని, అనంతరం షూటింగ్స్ పాల్గొంటారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమా రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. నవంబర్ లేదా డిసెంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నట్లు సమాచారం.