Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

కలిసి మాట్లాడతా అన్నా కదా..

Must read

తెలంగాణ వీణ , సినిమా : అగ్ర హీరో బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్‌ కేసరి’. అనిల్‌ రావిపూడి దర్శకుడు. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ విశేషాలను తెలియజేస్తూ గురువారం ఓ వీడియోను విడుదల చేశారు. 12 భారీ సెట్లలో, దేశంలోని అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపినట్లు మేకర్స్‌ తెలిపారు.
‘కలిసి మాట్లాడతా అన్నా కదా..అంతలోనే మందిని పంపాలా’ ‘బ్రో ఐ డోంట్‌ కేర్‌’ అంటూ వీడియోలో బాలకృష్ణ చెప్పిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ‘మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. తెలంగాణ యాసలో బాలకృష్ణ సంభాషణలు హైలైట్‌గా నిలుస్తాయి. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ సినిమా అందరిని మెప్పిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. కాజల్‌ అగర్వాల్‌, అర్జున్‌ రాంపాల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సి.రామ్‌ప్రసాద్‌, సంగీతం: తమన్‌, రచన-దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you