తెలంగాణ వీణ , సినిమా : అగ్ర సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్‌ను ఇటీవలకాలంలో వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం చెన్నైలో ఆయన నిర్వహించిన సంగీత కచేరి రసాభాసగా మారిన విషయం తెలిసిందే. నిర్వహణ వైఫల్యం కారణంగా అర్థాంతరంగా మ్యూజిక్ కాన్సర్ట్‌ను ముగించడం విమర్శలకు దారి తీసింది. తాజాగా రెహమాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. 2018లో ఓ మ్యూజిక్ కాన్సర్ట్ కోసం రెహమాన్ డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించలేదని చెన్నై సర్జన్స్ అసోసియేషన్ పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
ఒక్కరోజు మ్యూజిక్ కాన్సర్ట్ కోసం రెహమాన్‌కు 25లక్షలు చెల్లించామచెల్లించాల్సిన అవసరం లేదని రెహమాన్ సన్నిహితులు వాదిస్తున్నారు. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, రెహహన్ ప్రతీ విషయంలో ఒప్పందం ప్రకారమే నడుచుకుంటాడని ఆయన మేనేజర్ సెంథిల్ వేలన్ తెలిపారు.