తెలంగాణ వీణ , జాతీయం : కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మన దేశానికి మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కాదని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ ‘నెహ్రూ మన తొలి ప్రధాని కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోసే మన తొలి ప్రధాని.. ఆయన కారణంగానే బ్రిటీష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్లిపోయారు’ అని అన్నారు.
బాబా సాహెబ్ అంబేద్కర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారన్నారు. బాబా సాహెబ్ రాసిన పుస్తకంలో ‘నిరాహార దీక్షల వల్ల మనం స్వాతంత్య్రాన్ని పొందలేదు. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించాలనే అహింసా సిద్ధాంతం కారణంగా స్వాతంత్య్రం రాలేదు. బ్రిటీష్ వారిలో నేతాజీ పుట్టించిన భయం కారణంగానే స్వాతంత్య్రం వచ్చింది’ అని పేర్కొన్నారన్నారు.