తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జియ్యమ్మవలస మండలం రామినాయుడువలసలో గురువారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు రెచ్చిపోయింది. ఊర్లో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌పై దాడి చేశాయి.
రేకులు, కిటికీలు, తలుపులు, సరస్వతీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేశాయి. రైతులను, స్థానికులను అటవీ సిబ్బం ది అప్రమత్తం చేశారు. ఒంటరి ఏనుగు కొమరాడ మండలం అంకులవలస సమీపంలో ఉందని, మరో నాలుగు జరడ సమీపంలో ఉన్నాయని.. మొత్తం 12 ఏనుగులు కురుపాం ప్రాంతంలో సంచరిస్తున్నాయని అధికారులు తెలిపారు.