తెలంగాణ వీణ , హైదరాబాద్ :ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం వనపర్తిలో పర్యటించనున్నారు. దాదాపు రూ.666 కోట్ల విలువ గల పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. అలాగే మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా వస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో 50 వేల మందితో బహిరంగ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
4న బాన్సువాడకు మంత్రి కేటీఆర్
వర్ని, సెప్టెంబర్ 28: మంత్రి కేటీఆర్ వచ్చే నెల 4న కామారెడ్డి జిల్లా బాన్సువాడకు రానున్నారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.