Monday, December 23, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

బాలాపూర్‌ లడ్డూ వేలం.. 

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : గణేష్‌ నిమజ్జన సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వినిపించే ఘట్టాల్లో ఒకటి.. బాలాపూర్‌ లడ్డూ వేలం. బాలాపూర్‌ లడ్డూ వేలం నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఏయేడుకాయేడు ఎక్కువ ధరకు పలుకుతోంది. గతేడాది రూ. 24 లక్షలకు పోయిన లడ్డూ.. ఈసారి ఎంతకు పోతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. గురువారం (సెప్టెంబర్‌ 28) నిమజ్జనం నేపథ్యంలో.. కాసేపట్లో బాలాపూర్‌ లడ్డూ వేలంపాట మొదలుకానుంది.

ఉదయం 8.30-9 గంటల ప్రాంతంలో బాలాపూర్‌ లడ్డూ వేలంపాట మొదలుకానుంది. ఈ నేపథ్యంలో బాలాపూర్‌ వినాయకుడి దగ్గర సందడి నెలకొంది. ఇప్పటికే ఊరిలో గణేష్‌డిని ఉరేగిస్తున్నారు. గ్రామంలో ఇంటింటి దర్శనం అయిన తర్వాత లడ్డూ వేలంపాట నిర్వహిస్తారు. గతేడాది 24.60 లక్షలకు వేలంపాటలో పోయింది లడ్డూ. దీంతో ఈసారి ఎంతకు పోతుందో అనే ఆసక్తి ఏర్పడింది. ఈసారి వేలంలో 36 మంది పాల్గొననున్నారు. వీళ్లలో ముగ్గురే బాలాపూర్‌ వాసులు ఉన్నారు.

వేలంకు ముందే ఇతర ప్రాంత వాసులు రూ.25 లక్షలు చెల్లించారు. ఒకవేళ వాళ్లు గనుక సొంతం చేసుకోకుంటే తిరిగి డబ్బులు చెల్లిస్తుంది ఉత్సవ కమిటీ. వేలంపాట తర్వాతే బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్ర మొదలుకానుంది.

బాలాపూర్‌ లడ్డూ వేలంపాట.. ఎవరు దక్కించుకున్నారు.. ఎంతకంటే..
► 1994లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 450
► 1995లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 4,500
►1996లో కొలను కృష్ణారెడ్డి.. రూ. 18,000
►1997లో కొలను కృష్ణారెడ్డి… రూ. 28,000
►1998లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 51,000
►1999లో కల్లెం అంజి రెడ్డి .. రూ. 65,000
►2000లో కల్లెం ప్రతాప్‌రెడ్డి.. రూ.66,000
►2001లో రఘునందన్‌చారి.. రూ. 85,000
►2002లో కందాడ మాధవరెడ్డి.. రూ.1,05,000
►2003లో చిగిరింత బాల్‌రెడ్డి.. రూ.1,55,000
►2004లో కొలను మోహన్‌రెడ్డి…రూ. 2,01,000
►2005లో ఇబ్రహీం శేఖర్‌… రూ.2,80,000
►2006లో చిగిరింత తిరుపతి రెడ్డి..రూ.3,00,000
►2007లో రఘునందర్‌చారి.. రూ.4,15,000
►2008లో కొలను మోహన్‌రెడ్డి… రూ.5,07,000
►2009లో సరిత రూ.5,10,000
►2010లో కొడాలి శ్రీధర్‌బాబు..రూ.5,35,000
►2011లో కొలను బ్రదర్స్‌… రూ. 5,45,000
►2012లో పన్నాల గోవర్థన్‌రెడ్డి… రూ.7,50,000
►2013లో తీగల కృష్ణారెడ్డి… రూ.9,26,000
►2014లో సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి…రూ.9,50,000
►2015లో కొలను మదన్‌ మోహన్‌రెడ్డి… రూ.10,32,000
►2016లో స్కైలాబ్‌రెడ్డి… రూ.14,65,000
►2017లో నాగం తిరుపతిరెడ్డి… రూ.15,60,000
►2018లో శ్రీనివాస్‌గుప్తా.. రూ.16,60,000
►2019లో కొలను రామిరెడ్డి… రూ.17,60,000
►2020 కరోనా కారణంగా సీఎం కెసిఆర్ కి అందజేశారు…
►2021లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్‌రెడ్డి… రూ. 18,90,000
► 2022లో 24 లక్షల 60,000 వంగెటి లక్ష్మారెడ్డి బాలాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి కైవసం చేసుకున్నారు…

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you