Saturday, June 7, 2025
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

జూన్ 1 నుంచి వికారాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ పోటీలు ….

Must read

తెలంగాణవీణ , హైదరబాద్ : జూన్ 1వ తారీకు నుంచి వికారాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా బ్యాట్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కోసరాజు లక్ష్మణ్, జనరల్ సెక్రెటరీ బి ఏ వి డి ఉప్పలపాటి వి.ఎన్. బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు సబ్ జూనియర్, జూనియర్, మెన్, ఉమెన్, మాస్టర్ విభాగాలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలు కొండాపూర్ లోని ఏ జోన్ బ్యాట్మెంటన్ అకాడమీ లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీలు వికారాబాద్ జిల్లాకు సంబంధించిన బ్యాట్మింటన్ క్రీడాకారులకు మాత్రమేనని సూచించారు. ఇతర జిల్లా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అనర్హులన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు రిజిస్ట్రేషన్ మరియు జూన్ 1వ తేదీ స్పాట్ ఎంట్రీస్ చేసుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం బ్యాట్ వెబ్ సైట్లు సంప్రదించాలన్నారు. ఈ పోటీలు కొండాపూర్ లోని ఏ జోన్ బ్యాట్మింటన్ అకాడమీలో నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. ఇతర వివరాల కోసం మొబైల్ నెంబర్లు 76748 97777 లేదా 90000 05678 ను సంప్రదించాలని కోరారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you