తెలంగాణ వీణ, మేడ్చల్ జిల్లా : అభిమానం ఎంతైనా ఉండొచ్చుగాని ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం అవసరమా సారు. నడి రోడ్డు పైనే ఫ్లెక్సీ లు, కటౌట్లు ఏర్పాటు చేయడం ఏంటి పిచ్చితనం కాకపోతే. ప్రతినిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలతో రాద్దిగా ఉండే ప్రాంతం అది. ప్రమాదలకు పుట్టినిల్లు ఆ రోడ్డు అక్కడే ఏకంగా రోడ్డు మధ్యలోనే ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేసి వేడుకలు చేస్తుంటే సంబంధిత అధికారులు మాత్రం వేడుక చూస్తున్నారు. దొంగల మైసమ్మ రింగు రోడ్డు వద్ద ప్రమాదకరంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించమని కనీసం మీరైన చెప్పండి ఎంపి సారు..
