తెలంగాణ వీణ గజ్వేల్ : కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామస్తులకు తగు న్యాయం చేస్తామని గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ అన్నారు.కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామస్తులైన మామిడియాల గ్రామస్తులు ఆర్డీవో చంద్రకళను కలిసి వారి బాధను చెప్పుకున్నారు.
ఏడు సంవత్సరాల నుండి మాకు పరిహారం అందలేదని అప్పటి ఆర్డీవో మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి దృష్టిలకు తీసుకెళ్లిన కూడా పరిష్కరించలేదని అన్నారు. న్యాయంగా మాకు రావాల్సిన పరిహారం డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు ఇప్పించాలని ఆర్డీవోను వేడుకున్నారు. ఏడేళ్లయినా మా సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు. మాకు సంబంధించిన భూములు ఇల్లులు మీకు అవసరం వస్తాయి కానీ మాకు న్యాయం చేయడం ఎందుకు ఆలస్యం అవుతుందని వారు ఆర్డిఓ చంద్రకళను అడిగారు. ఆర్డీవో చంద్రకళ మాట్లాడుతూ ముంపు గ్రామస్తులకు తగు న్యాయం చేస్తామని అన్నారు. మీరు ఇచ్చిన లిస్టును వెరిఫై చేయించి త్వరగా పరిహారం అందేటట్లు చూస్తామని అన్నారు. ఇంతకాలం లేట్ అయిందని బాధపడొద్దని అధైర్యపడుద్దని ఆమె అన్నారు.