తెలంగాణ వీణ, హైదరాబాద్ : మిర్యాలగూడ నటుడు నిర్మాత సామాజిక వేత్త డాక్టర్ మూసా ఆలీ ఖాన్ కు అరుదైన గౌరవం.ఈ కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ రంజిత్ ఆర్ కె కళా ఫౌండేషన్ చైర్మన్ విశ్వ ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయ నాట్య కళా వైభవం కార్యక్రమం లో డాక్టర్ మూసా ఆలీ ఖాన్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.
తన చేతుల మీదుగా అవార్డు గ్రహీతలకు అవార్డులు ప్రదానం జరిగింది.మిర్యాలగూడ వాసి నటుడు ,నిర్మాత డాక్టర్ మూసా ఆలీ ఖాన్ మాట్లాడుతూ ఈ సత్కారం ఈ గౌరవం కళాకారుల అభిమానం ఎన్నటికీ మరువలేనని ఇంకా బాధ్యతతో కళా రంగంలో తన వంతు కృషి చేస్తానని ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టం గా భావిస్తు న్నానన్నారు.ఇంత గొప్ప కార్యక్రమం లో పాల్గొనడం గర్వంగా ఉందనీ,నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరియు సినిమా జర్నలిస్టులకు సినిమా పిఆర్ ఓ లకు నాతోటి కళాకారులకు గాయనీ గాయకుల కు పుర ప్రముఖులకు సాహితీ ప్రియులకు సామాజిక మాధ్యమాల్లో నన్ను ఆశీర్వదిస్తూ ప్రోత్సహిస్తున్న వారందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు.