తెలంగాణవీణ, ఖమ్మం : తెలంగాణకు చెందిన యువకుడిపై అమెరికాలో దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు సాయితేజ అక్కడికక్కడే మృతిచెందాడు.సాయితేజ అమెరికాకు ఎమ్మెస్ చేయడానికి వెళ్లాడు. సాయితేజ మృతితో రామన్నపేటలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని ఖమ్మం తీసుకురావడానికి అధికారులు కృషి చేస్తున్నారు.