తెలంగాణవీణ, జాతీయం : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరి మోగించిన ‘మహాయూతి’ కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి ఎంపికపై కూటమి నేతల్లో ఓవైపు ఉత్కంఠ కొనసాగుతుండగా, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ సీఎం ఏక్‌నాథ్ షిండే మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు.షిండే ఉదయమే గవర్నర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారని, కొత్త ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసేంత వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి…