తెలంగాణవీణ, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ పై డీకే అరుణ ఫైర్ అయ్యారు. సోనియా గాంధీ పుట్టిన రోజే అన్ని హామీలు అమలు చేస్తాం అన్నారని గుర్తు చేశారు. ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఒక్క ఇల్లు మొదల పెట్టలేదన్నారు. కేంద్రం నిధులు లేకుండా వీళ్ళు ఇళ్లు కడతారా..? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ సగం మందికి కాలేదన్నారు. సిగ్గులేకుండా రేవంత్ అబద్ధాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం కర్నాటకలో డీకే శివకుమార్ ఫ్రీ బస్ ఎత్తేస్తాం అంటున్నారని తెలిపారు. గ్రామాలకు బస్సులు బంద్ చేసి ఫ్రీ బస్ అంటున్నారని అన్నారు. అన్ని అమలు చేస్తున్నాం అనడానికి సీఎం రేవంత్ కు సిగ్గు ఉండాలన్నారు. ప్రధాని మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల వైఫల్యాలు ఎత్తి చూపారన్నారు. రూ.500 రూపాయలకే సిలిండర్ లో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ 375 , మరి మీరిచ్చేది ఎంత..? అన్నారు.