తెలంగాణ వీణ, హైదరాబాద్ : సైదాబాద్ లోని స్పెషల్ అబ్జర్వేషన్ హోమ్‌ను మంత్రి సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇక్కడ 72 మంది విద్యార్థులు ఉన్నారని, ఇక్కడ బాల నేరస్తులుగా వచ్చినవారిలో పరివర్తన తీసుకొస్తున్నామన్నారు. ఇది శిక్ష కాలం కాదు శిక్షణ కాలమని ఆమె వ్యాఖ్యానించారు. మన ప్రభుత్వ అబ్జర్వేషన్ ఉన్నంతవరకు వాళ్ళలో మంచి పరివర్తన రావాలని, వాళ్లకి కావాల్సిన ఎడ్యుకేషన్, వృత్తిపరమైన కోర్సులను నేర్పిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. టాటా టెక్నికల్ సపోర్ట్‌తో సాంకేతిక పరిజ్ఞానం నేర్పిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. విలు విద్యలో నేషనల్ గేమ్స్ వరకు రాణిస్తున్నారని, ఇంకా అవకాశాలు కల్పించి యోగ్యులుగా తీర్చిదిద్దుతామన్నారు.