తెలంగాణ వీణ, చేగుంట మండల్ : మెదక్ జిల్లా చేగుంట లోసైబర్ నేరాలపై జిల్లా ఎస్పీ ఆదేశానుసారం చేగుంట, ఎస్ ఐ,చైతన్య కుమార్, రెడ్డి ఆధ్వర్యంలో ఏఎస్ఐ రాంబాబు,చేగుంట టూ గజ్వెల్ వెల్లే రహదారిపై ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు,వారు మాట్లాడుతూ, మండలంలో ఉన్న ప్రజలు, ఎవరు ఏమి ఫోన్ చేసినా, ఓటిపి చెప్పకూడదని, బ్యాంకు నుంచి ఫోన్ చేసినాము, మీకు జాబ్ వస్తది, మీరు ముందుగా , మాకు కొన్ని డబ్బులు కట్టమని చెపుతారు, ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు చెప్పారు ఎవరైనా సైబర్ నేరాలకు మోసపోతే, అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్ కు కానీ , 1930 కు కానీ ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అన్నారు,ఈ కార్యక్రమం లో, ఎస్ ఐ, చైతన్య కుమార్ రెడ్డి,ఏఎస్ఐ రాంబాబు, కానిస్టేబుల్, బి, రాజు, కే రాజు, తదితరులు పాల్గొన్నారు.