తెలంగాణ వీణ, మెదక్ జిల్లా : చేగుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలు దగ్గర మొదటి రోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ సందర్భంగా పట్టణనికి చెందిన కాంగ్రెస్ నాయకులు అయిత పరంజ్యోతి, బతుకమ్మ పండుగ ఉద్దేశించి మాట్లాడుతూ ఎక్కడైనా దేవుళ్లను పూజించడానికి పూలను వినియోగిస్తారు. కానీ మన తెలంగాణలో పూలనే దేవతగా భావించే పండుగ బతుకమ్మ అని,తీరొక్క రంగుల పూలను బతుకమ్మగా పేర్చి గౌరమ్మను పెట్టి భక్తి శ్రద్ధలతో మహిళలు పూజిస్తారు అని అన్నారు. మహిళలు తమ కష్టాలను వదిలేసి, అందరితో కలిసి ఆటపాటలతో ఆడుకునే పండుగ బతుకమ్మ అని అన్నారు . భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలియజేసే పండుగను మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ గా మొదలై చివరి రోజున సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు అని అన్నారు.