తెలంగాణ వీణ, హైదరాబాద్ :మలయాళ సినీ రంగంలో పలువురు నటీమణులు లైంగిక ఆరోపణలు చేస్తూ సంచలన విషయాలను బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగు సినీ రంగంలో కూడా లైంగిక ఆరోపణలు మొదలయ్యాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ లైంగిక వివాదంలో చిక్కుకున్నారు. జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు తీసుకున్న రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్ డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు, అలాగే నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళా కొరియోగ్రాఫర్ తన ఫిర్యాదులో రాసుకొచ్చారు. దీంతో, జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం (323)లోని క్లాజ్ (2), (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. మరి ఈ కేసు పై జానీ మాస్టర్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.