తెలంగాణ వీణ, హైదరాబాద్ : ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖులు విరాళాలు ఇచ్చారు. సోమవారం జూబ్లీహిల్స్ నివాసంలోని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్‌లు అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి రూ. 50 లక్షలు,తన కుమారుడు రామ్ చరణ్ తరపున మరో రూ. 50 లక్షలు.. రెండు చెక్కులను ముఖ్యమంత్రికి అందజేసారు. అలాగే అమర్ రాజా గ్రూప్ తరపున సీఎం సహాయనిధికి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి. రూ. కోటి విరాళం అందజేసారు. సినీ నటుడు అలీ సీఎం సహాయనిధికి రూ.3 లక్షలు విరాళంగా అందజేశారు. మరో సినీ నటుడు విశ్వక్ సేన్ రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. నటుడు సాయిధరమ్ తేజ్ రూ.10 లక్షల విరాళం అందజేసారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి రూ.25లక్షల విరాళం ఇచ్చారు.