Monday, December 23, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఎయిర్‌టెల్ పండగ ఆఫర్లు ఈ ప్లాన్లపై అదనపు డేటా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌:

Must read

తెలంగాణవీణ జాతీయం : ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ పండగవేళ.. ప్రీపెయిడ్ యూజర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ తీసుకొచ్చింది. ప్రస్తుతం అందిస్తున్న కొన్ని ప్లాన్లలో అదనపు డేటా, ఓటీటీ సదుపాయాలను జోడించింది. ఈ ఆఫర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబర్‌ 11 లోపు రీఛార్జి చేసుకున్నవాళ్లు మాత్రమే ఈ బెనిఫిట్స్‌ పొందుతారు. ఇంతకీ ఎయిర్‌టెల్‌ అదనపు ప్రయోజనాలు అందిస్తున్న ప్లాన్లు ఏవంటే..రూ.979 ప్లాన్‌: 84 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు, రోజూ 2జీబీ డేటా వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం (22+ ఓటీటీ సదుపాయాలు) యాక్సెస్‌, మూడు నెలల పాటు అపోలో 24|7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్‌లు, రివార్డ్ మినీ సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తోంది. అదే ఆఫర్‌లో సమయంలో ఈ ప్లాన్‌ రీఛార్జితో అదనంగా 10జీబీ డేటా ఇస్తోంది. వాటి వ్యాలిడిటీ 28రోజులు ఉంటుంది. రూ.1029 ప్లాన్‌: రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత వాయిస్‌ కాల్స్‌ అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 84 రోజులు. 3నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ సదుపాయం, రివార్డ్‌ మినీ సబ్‌స్క్రిప్షన్‌, అపోలో 24/7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్‌లు ప్రయోజనాలు ఉన్నాయి. ఫెస్టివల్‌ ఆఫర్‌లో రీఛార్జి చేసుకుంటే 10జీబీ డేటా ఉచిత కూపన్‌తో పాటు, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా అందిస్తోంది. అయితే వీటి వ్యాలిడిటీ 28రోజులు.రూ.3,599 ప్లాన్‌: 365 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు, రోజూ 2జీబీ డేటా వంటి ప్రయోజనాలు ఉన్నాయి. మూడు నెలల పాటు అపోలో 24/7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్‌లు యాక్సెస్‌ అందిస్తోంది. అదే ఆఫర్‌ సమయంలో రీఛార్జి చేసుకుంటే అదనంగా 10జీబీ డేటా, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం యాక్సెస్‌ ఇస్తోంది. దీని వ్యాలిడిటీ 28రోజులు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you