తెలంగాణవీణ జాతీయం ; బాలీవుడ్ నటీనటులు శ్రద్ధాకపూర్ రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన తాజా చిత్రం ‘స్త్రీ 2’). కామెడీ హారర్ ఫిల్మ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. తాజాగా రికార్డు సాధించింది.మొదటిరోజే రూ.54కోట్లు వసూళ్లు చేసి రికార్డు క్రియేట్ చేసిన ‘స్త్రీ2’.. తాజాగా మరో ఘనత సాధించింది. కేవలం ఇండియాలోనే రూ.502 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. బాలీవుడ్‌లో మరో రెండు వారాల వరకు సందడి చేసేందుకు ఏ పెద్ద సినిమాలు లేకపోవడంతో ‘స్త్రీ2’ కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్‌లో ఈ ఏడాది అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా ఈ చిత్రం రికార్డు సృష్టించింది.‘స్త్రీ 2’ విడుదలయ్యాక.. మూవీ మేకింగ్ గురించి సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ‘స్త్రీ’ మాదిరిగానే ‘స్త్రీ 2’ కూడా మంచి ఫన్ అందించిందని మూవీ లవర్స్ అభిప్రాయపడ్డారు. శ్రద్ధాకపూర్ – రాజ్‌కుమార్‌రావు జోడీ మరోసారి హిట్ అయ్యిందని కామెంట్స్ చేశారు. ఆగస్టు 15న విడుదలైన పలు స్టార్ హీరోల చిత్రాలు ‘వేదా’ (జాన్ అబ్రహం), ఖేల్ ఖేల్ మే (అక్షయ్‌కుమార్)కు ఇది గట్టి పోటీ ఇచ్చింది. శ్రద్ధాకపూర్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇది నిలవడం విశేషం. ఈ ఏడాది ఇప్పటివరకూ విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో ‘కల్కి 2898 ఏడీ’ తొలి స్థానంలో ఉండగా.. ‘స్త్రీ 2’ రెండో స్థానాన్ని సొంతం చేసుకుందని అంచనా.