తెలంగాణవీణ సినిమా : కష్టాల్లో ఉన్నవారికి చేయూతనందించడంలో సినీతారలు ఎప్పుడూ ముందుంటారు. ఈనేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం ఒక్కొక్కరిగా విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా నటుడు ప్రభాస్ రూ.2 కోట్లు విరాళంగా అందించనున్నట్లు టీమ్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.కోటి ఇవ్వనున్నట్లు పేర్కొంది. మరోవైపు నటుడు అల్లు అర్జున్ సైతం విరాళం ప్రకటించారు. రెండు రాష్ట్రాలకు కలిపి రూ.కోటి విరాళంగా ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని ప్రజలంతా సురక్షితంగా ఉండాలని తాను భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. దీంతో సినీప్రముఖులు బాధితులకు అండగా నిలుస్తున్నారు. చిరంజీవి రూ.కోటి, బాలకృష్ణ రూ.కోటి, మహేశ్‌బాబు రూ.కోటి, ఎన్టీఆర్ రూ.కోటి, సిద్ధూ జొన్నల గడ్డ రూ.30 లక్షలు, విష్వక్‌సేన్ రూ.10 లక్షలు, వెంకీ అట్లూరి రూ.10 లక్షలు, అనన్య నాగళ్ల రూ.2.5లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్లు వైజయంతి