తెలంగాణ వీణ/యాదగిరిగుట్ట: శ్రావణ మాసం రెండోవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పూజలు భక్తి శ్రద్ధలతో ఇంటింటా మహిళలు జరుపుకున్నారు. యాదగిరిగుట్ట లోని శ్రీరామ్ నగర్, బీసీ కాలనీలో ఇంటింటా లక్ష్మీ దేవి మండపాన్ని రకరకాల పువ్వులతో అలంకరణ చేసి,నైవేద్యాలు ప్రసాదాలు లక్ష్మీ దేవి కి సమర్పించారు.. వరలక్ష్మీ వ్రత కథ చదువుతూ.. పూజలు భక్తితో చేశారు.. ముతైదువులను పిలిచి వాయినా లు, పసుబొట్టు ఇచ్చారు.