తెలంగాణ వీణ/తార్నాక: శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పూజలు భక్తి శ్రద్ధలతో ఇంటింటా మహిళలు జరుపుకున్నారు. తార్నాక లోని సండే మార్కెట్,వివిధ కాలనీలలో వసంత,విజయ,పద్మ,నవ్య మహిళా నాయకురాలు.. ప్రతీ ఇంటింటా లక్ష్మీ దేవి మండపాన్ని రకరకాల పువ్వులతో అలంకరణ చేసి,నైవేద్యాలు ప్రసాదాలు లక్ష్మీ దేవి కి సమర్పించారు.. వ్రతంలో చారుమతి కథను వివరించుకున్నారు . పాటలు పాడుతూ తమకు అష్ట ఐశ్వర్యాలు సౌభాగ్యాలను పిల్లపాపలు ఆయురారోగ్యాలు ఇమ్మని లక్ష్మీ దేవినీ వేడుకున్నారు. ముతాయిదువులకు వాయినాలు ఇచ్చికున్నారు.