తెలంగాణవీణా జాతీయం :సినీ నటులు ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం)’ ఒకటి. 2024 సంవత్సరానికి సంబంధించిన అవార్డుల్ని ఐ.ఎఫ్.ఎఫ్.ఎం అందించింది. ఈ అవార్డుల్లో ‘12th ఫెయిల్’ రెండు పురస్కారాలను గెలుపొంది మరోసారి సత్తా చాటింది. ‘చందు ఛాంపియన్’కు గాను ఉత్తమ నటుడిగా కార్తీక్ ఆర్యన్ అవార్డును సొంతం చేసుకున్నారు. కిరణ్‌రావు ‘లాపతా లేడీస్’ ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకుంది. ఆగస్టు 15 నుంచి 25 వరకు జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులను, దర్శకులను సత్కరించనున్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న ఈ ఈవెంట్‌లో హీరో రామ్‌చరణ్ ‘ఆర్ట్ అండ్ కల్చరల్ బ్రాండ్ అంబాసిడర్’గా అవార్డును అందుకున్నారు. దీనికోసం అక్కడికి వెళ్లిన రామ్ చరణ్ ఆస్ట్రేలియాలో మన జాతీయజెండాను ఎగురవేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.