Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

రియల్‌మీ సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జర్‌.. 4 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్‌ :

Must read

తెలంగాణవీణ జాతీయం : ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ రియల్‌మీ 320W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీగా పేర్కొంది. ఈ ఛార్జర్‌ సాయంతో ఫుల్‌ బ్యాటరీని కేవలం నాలుగే నిమిషాల్లో ఛార్జ్‌ చేయొచ్చని కంపెనీ పేర్కొంది. చైనాలోని షెన్‌జెన్‌లో రియల్‌మీ ప్రధాన కార్యాలయంలో దీన్ని ఆవిష్కరించింది.రియల్‌మీ తీసుకొచ్చిన ఛార్జింగ్‌ టెక్నాలజీకి సూపర్‌సోనిక్‌ ఛార్జ్‌గా నామకరణం చేసింది. ఇది 4,420 ఎంఏహెచ్‌ బ్యాటరీని కేవలం 4 నిమిషాల 30 సెకన్లలో ఛార్జ్‌ చేయగలదని పేర్కొంది. కేవలం ఒక్క నిమిషంలో 26 శాతం, రెండు నిమిషాల్లోపే 50 శాతం బ్యాటరీని ఛార్జ్‌ చేయొచ్చని కంపెనీ పేర్కొంటోంది. హై-పవర్‌, కాంప్టాక్ట్‌ సైజ్‌, ఫాస్ట్‌ ఛార్జింగ్‌లో భద్రత వంటి అంశాల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి రెండేళ్ల పాటు శ్రమించి ఈ ఛార్జర్‌ను తీసుకొచ్చినట్లు రియల్‌మీ తెలిపింది. ఇదే కంపెనీ గతేడాది రియల్‌మీ జీటీ3లో 240W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను తీసుకొచ్చింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you