తెలంగాణవీణ సినిమా :తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ నటించనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీటిపై ఆమె స్పందించారు. ప్రభాస్‌తో మృణాల్ ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. ‘ఇది హను రాఘవపూడి చిత్రం ఫస్ట్‌లుక్’ అని ఆ ఫొటోకు క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్‌పై మృణాల్ స్పందించారు. ‘మీ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెడుతున్నందుకు క్షమించండి. నేను ఈ ప్రాజెక్ట్‌లో లేను’ అని కామెంట్ చేశారు. దీంతో రూమర్‌కు చెక్ పడింది. మరి ఇందులో ప్రభాస్ సరసన ఎవరు కనిపిస్తారో అనే చర్చ మరోసారి మొదలైంది.హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ పీరియాడికల్ డ్రామాగా ఈ చిత్రం రానుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఇది తెరకెక్కనుంది. తాజాగా దీనికి సంబంధించిన టైటిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఆగస్టు 17న రానున్నట్లు తెలుస్తోంది.ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మాత టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస కుమార్(ఎస్‌కెఎన్) ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రానున్న ‘రాజాసాబ్’ గ్లింప్స్‌ను ‘మిస్టర్ బచ్చన్’ థియేటర్స్‌లో చూడొచ్చని తెలిపారు. దీంతో బిగ్‌స్క్రీన్‌పై ‘రాజాసాబ్’ను చూసేందుకు ఆయన అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.