తెలంగాణవీణ జాతీయం : కూల్ డ్రింక్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పెప్సీ, కోకాకోలానే! భారతీయుల అభిమానం చూరగొన్న ఈ ఫారిన్ బ్రాండ్స్ దేశీ మార్కెట్‌పై పూర్తి ఆధిపత్యం సాధించాయి. కానీ, గతంలో మాత్రం ఈ బ్రాండ్స్‌కు దేశీ కూల్ డ్రింక్‌లు గట్టిపోటీ ఇచ్చాయి. గోల్డ్ స్పాట్, డబుల్ సెవెన్, కాంపా కోలా వంటి బ్రాండ్స్ ఆ తరం వారికి ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. అప్పటి ప్రభుత్వం వెన్నుదన్ను ఇవ్వడంతో దేశీ బ్రాండ్స్‌కు పోటీనే లేకుండా పోయింది. అయితే, 1990ల నాటి ఆర్థిక సంస్కరణల ఫలితంగా భారత మార్కెట్‌పై విదేశీ బ్రాండ్స్ మళ్లీ పట్టు బిగించాయి. తాజాగా వాటి ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేసేందుకు ముఖేశ్ అంబానీ రంగంలోకి దిగారు. మరి ఆయన వ్యూహం ఏంటో.