Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఒలింపిక్‌ పతకం వారానికే రంగు పోయింది: అథ్లెట్‌ సంచలన పోస్ట్‌:

Must read

తెలంగాణవీణ జాతీయం : పారిస్‌ ఒలింపిక్స్‌ ( 2024)లో తాము బస చేసే క్రీడా గ్రామంలో వసతులు సరిగా లేవంటూ ఇప్పటికే చాలామంది అథ్లెట్లు అసంతృప్తి వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఒలింపిక్‌ పతకంపై ఓ అథ్లెట్‌ పెట్టిన పోస్ట్‌ మరో వివాదానికి తెర లేపింది. పారిస్‌లో కాంస్యం సాధించిన అమెరికా స్కేటర్‌ నిజా హ్యూస్టన్‌.. వారానికే దాని రంగు పోయిందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ మేరకు పతకం తాజా ఫొటోను షేర్‌ చేస్తూ నాణ్యత గురించి ప్రశ్నించాడు.‘‘ఈ ఒలింపిక్‌ పతకాలు కొత్తగా ఉన్నప్పుడు చాలా అద్భుతంగా కన్పించాయి. కానీ దాన్ని నేను వేసుకున్నాక చెమట తగిలి కొంత రంగు మారిపోయింది. అనుకున్నంత నాణ్యతగా లేవు. కాస్త గరుకుగా మారిపోయింది. ముందువైపు రూపు మారింది. ఈ పతకాల నాణ్యతను మరింత పెంచితే బాగుంటుంది. ఈ పతకాన్ని చూస్తుంటే ఏదో యుద్ధానికి వెళ్లి వచ్చినట్లుగా అనిపిస్తోంది’’ అని హ్యూస్టన్‌ పేర్కొన్నాడు. రంగు మారిన పతకం ఫొటోను షేర్‌ చేశాడు. గతవారం జరిగిన స్ట్రీట్‌ స్కేట్‌బోర్డింగ్‌లో ఈ స్కేటర్‌ కాంస్య పతకం నెగ్గాడు.దీనిపై పారిస్‌ ఒలింపిక్స్‌ అధికార ప్రతినిధి స్పందించారు. సామాజిక మాధ్యమాల ద్వారా విషయాన్ని తెలుసుకున్నామన్నారు. దీనిపై చర్యలు చేపట్టామని, డ్యామేజ్‌ అయిన మెడల్స్‌ స్థానంలో కొత్త వాటిని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you