తెలంగాణవీణ జాతీయం : పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రాకు రజతం దక్కింది. పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ స్వర్ణ పతకం సాధించాడు. ఈ క్రమంలో నీరజ్ తల్లి సరోజ్ దేవి బంగారు పతకం సాధించిన నదీమ్ కూడా తనకు కుమారుడిలాంటివాడేనని వ్యాఖ్యానించారు. దీనిపై కొందరు సానుకూలంగా స్పందించగా.. మరికొందరు మాత్రం విభిన్నమైన కామెంట్లు చేశారు. భారత్ – పాక్ మధ్య శత్రుత్వం ఉన్న వేళ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదనే భావనను వ్యక్తంచేశారు. దీంతో తన తల్లి వ్యాఖ్యలపై వస్తున్న కామెంట్లపై నీరజ్ చోప్రా స్పందించాడు. ‘‘మా అమ్మ గ్రామంలో ఉంటుంది. గ్రామీణప్రాంత వాసి. సోషల్ మీడియా, టెలివిజన్లలో వచ్చే భారత్ – పాక్ సంబంధాలపై ఆమెకు పెద్దగా తెలియదు. ఒక తల్లిగా మాత్రమే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మనస్ఫూర్తిగా మాట్లాడారు. తల్లి హృదయంతో అలా మాట్లాడింది. కానీ, కొందరికి మాత్రం అందులోనూ వింతగా అనిపించింది. ఇంకొందరికి నచ్చింది. సింపుల్‌గా మాట్లాడటంతోనే ఇలాంటి సమస్య ఎదురైంది’’ అని నీరజ్ తెలిపాడు.నదీమ్ గురించి నీరజ్ తల్లి సరోజ్ స్పందించినట్లే.. నీరజ్‌పైనా నదీమ్ అమ్మ కూడా మాట్లాడారు. ‘‘నీరజ్ కూడా నాకు కుమారుడివంటివాడే. అతడు నదీమ్‌కు స్నేహితుడు. అలాగే సోదరుడిలా భావిస్తాడు. క్రీడల్లో గెలుపోటములు సహజం. భవిష్యత్తులోనూ నీరజ్ మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా. నదీమ్‌తోపాటు నీరజ్ కోసమూ ప్రార్థిస్తా’’ అని నదీమ్ తల్లి స్థానిక ప్రెస్‌తో వ్యాఖ్యానించారు.వినేశ్ అంశంపై నీరజ్.. ‘‘ఇప్పటివరకు నేరుగా వినేశ్‌తో మాట్లాడలేదు. పారిస్ ఒలింపిక్స్‌లో ఆమె చాలా కష్టపడింది. రెజ్లింగ్ రూల్స్‌పై నాకు పెద్దగా అవగాహన లేదు. ఒకవేళ బరిలో ఉండుంటే తప్పకుండా గోల్డ్ కొట్టేదే. ఆమె విషయం తెలిసినప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉన్నా. తీవ్రమైన బాధ కలిగింది. ఎలా జరిగిందో తెలియదు కానీ, దేవుడు మరొకటి ప్లాన్ చేసి ఉంటాడు. గాయం నుంచి కోలుకుని