తెలంగాణవీణ జాతీయం : వయనాడ్ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్ స్వయంగా ముందుకొచ్చారు. శనివారం ఆయన టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంపునకు చేరుకున్నారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్.. విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘కొండచరియలు విరిగి పడిన ప్రాంతాలను ప్రత్యక్షంగా చూస్తుంటే ఈ ఘటన తీవ్రత అర్థమవుతోంది. ఆర్మీతో పాటు రెస్క్యూ బృందాలన్నీ అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇక్కడ ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్‌లో నేనూ భాగమే. దాని తరఫున సహాయక చర్యల కోసం రూ.3కోట్లు విరాళమివ్వాలని నిర్ణయించుకున్నా. అవసరమైతే మరి కొంత సాయమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని అన్నారు. కోజికోడ్ నుంచి రోడ్ మార్గంలో వయనాడ్‌కు వెళ్లి ఆర్మీ అధికారులతో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.
వయనాడ్ విషాదం.. కుటుంబాన్ని కాపాడేందుకు రెస్క్యూ టీమ్ డేరింగ్ ఆపరేషన్వ యనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఎంతోమంది మృతిచెందడం యావత్ దేశాన్ని కలచివేస్తోంది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకువస్తున్నారు. ఇప్పటికే పలువురు నటులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళాలు ఇచ్చారు. తాజాగా కమల్‌హాసన్ రూ.25లక్షలు విరాళం అందించారు. మరోవైపు ఆచూకీ గల్లంతైనవారిని గుర్తించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎక్కడెక్కడ ఎవరు చిక్కుకుపోయారో తెలుసుకునేందుకు డ్రోన్లు, రాడార్లు, మొబైల్ ఫోన్ల సిగ్నళ్ల ద్వారా ముమ్మర ప్రయత్నం కొనసాగుతోంది. ఇంకా వందలమంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది.