తెలంగాణవీణ సినిమా : చిత్రం: శివం భజే; నటీనటులు: అశ్విన్‌బాబు, దిగంగన సూర్యవన్షీ, హైపర్ ఆది, బ్రహ్మాజీ, తనినికెళ్ల భరణి తదితరులు; నిర్మాత: మహేశ్వర్‌రెడ్డి దర్శకత్వం: అబ్దుల్ అప్సర్ హుస్సేన్, విడుదల: 01-08-2024 ఆగస్టులో ప్రతివారం కొత్త సినిమాల జోరు కనిపించనుంది. పదుల సంఖ్యలో సినిమాలు బాక్సాఫీసు ముందుకు పోటెత్తనున్నాయి. తాజాగా అశ్విన్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘శివం భజే’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘హిడింబ’ తర్వాత అతడు నటించిన చిత్రమిది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈసారి ఏ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు?కథేంటంటే: చంద్రశేఖర్ అలియాస్ చందు (అశ్విన్ బాబు) బాల్యంలోనే తండ్రి చనిపోతాడు. తల్లి, చెల్లెలి బాధ్యతల్ని చూసుకుంటూ… ఈఎమ్ఐలు వసూలు చేసే పనిలో కొనసాగుతుంటాడు. ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు. దాంతో ట్రాన్స్‌ప్లాంటేషన్ జరుగుతుంది. కొత్త కళ్లు అమర్చాక రెండు హత్యోదంతాలకి సంబంధించిన జ్ఞాపకాలు మదిలో మెదులుతుంటాయి. వైద్యుల దగ్గరికి వెళితే జీనో ట్రాన్స్‌ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తేలుతుంది. ఇంతకీ జీనో ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఏమిటి? అదెలా జరిగింది? చందుకి వస్తున్న జ్ఞాపకాలు, వాటిలో హత్యల వెనక కథేమిటి? తన ప్రియురాలు శైలజ (దిగంగన సూర్యవన్షీ) కూడా హత్యకి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే: కుటుంబం, నేర నేపథ్యం, పరిశోధన, దైవిక సంబంధమైన అంశాలు, సైన్స్… ఇలా నాలుగైదు జానర్లు కలగలిసిన సినిమా ఇది. కానీ, తెరపైన ఏ ఒక్కదానికీ పరిపూర్ణమైన న్యాయం జరిగినట్టు అనిపించదు. మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనదే. కానీ, తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది. ప్రతి సన్నివేశం కృతకంగా ప్రేక్షకుడిపైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగిపోతుంది. భారతదేశంపై పొరుగు దేశాలు కుట్ర పన్నడం నుంచి కథ మొదలవుతుంది. ఆ తర్వాత వరుసగా అంతు చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం, వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది. నేర పరిశోధన అన్నప్పుడు సన్నివేశాలు ఎంత థ్రిల్లింగ్‌గా, సీరియస్‌గా సాగాలి? ఏసీసీ మురళి (అర్బాజ్‌ఖాన్) రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే. అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా ఆకట్టుకుంటుంది? పోలీసుల సంగతి పక్కనపెడతాం.: