తెలంగాణవీణ జాతీయం : అంతర్జాతీయ మ్యాచ్ కూడా అదే. కొద్దిరోజులకే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అప్పటి మ్యాచ్ విశేషాలు గుర్తుచేసుకున్నాడు. 2019 ప్రపంచ కప్ ఓటమి నుంచి బయటపడేందుకు కాస్త సమయం పట్టిందని పేర్కొన్నాడు. ‘‘నాకు అదే చివరి వరల్డ్ కప్ అని తెలుసు. విజయం సాధించిఉంటే చాలా బాగుండేది. నన్ను అత్యంత బాధపెట్టిన క్షణం అదే. ఫలితం ఎలా వచ్చినా మనం తీసుకోవాలి. ముందుకుసాగిపోవాలి. కానీ, వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఓటమిని తీసుకోవడానికి కాస్త సమయం పట్టిందనే చెబుతా. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఇప్పుడు నాకు చాలా సమయం ఉంది. తప్పకుండా మనసును బాధపెట్టిన క్షణం మాత్రం అదే. విజయం కోసం తీవ్రంగా శ్రమించాం. కానీ గెలవలేకపోయాం’’ అని ధోనీ వ్యాఖ్యానించాడు. ఫేవరెట్ బ్యాటర్ ఎవరని చెప్పడం చాలా కష్టం‘‘ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో నాకు ఇష్టమైన ప్లేయర్ల గురించి చెప్పడం కష్టమే. మరీ ముఖ్యంగా బ్యాటర్ల విషయంలో చెప్పలేను. చాలామంది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలో ఎవరని అడుగుతుంటారు. వీరేకాకుండా మరికొందరు అద్భుత బ్యాటర్లు ఉన్నారు. అలాగని అత్యుత్తమ బౌలర్లు లేరని కాదు. బ్యాటర్ల విషయం పక్కనపెడితే.. బౌలింగ్‌లో మాత్రం మరో ఛాన్స్ లేదు. అది బుమ్రానే అని ధోనీ వెల్లడించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లోనే అభిమానులను అలరిస్తున్న ధోనీ.. వచ్చే ఏడాది సీజన్‌లో ఆడతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. సీఎస్కేను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోనీ ఇటీవల ముగిసిన సీజన్ సమయంలో కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేసిన సంగతి తెలిసిందే.