తెలంగాణవీణ జాతీయం : వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 180 మంది మృతిచెందిన ఘటన యావత్ దేశాన్ని కలిచి వేస్తోంది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పలు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు పలువురు ప్రముఖులూ ముందుకొస్తున్నారు. నటుడు విక్రమ్ కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.20లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.