తెలంగాణవీణ హైదరాబాద్ : అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏకవచనంతో కేటీఆర్ పిలవడంపై అధికార పక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. ‘‘రేవంత్ రెడ్డి నాకు 18 ఏళ్ల నుంచే తెలుసు. ఆయన నాకు మంచి మిత్రుడు. అయితే.. గత పదేళ్ల నుంచి మాకు, ఆయనకు చెడింది. ఆయన అదృష్టవంతుడు.. చిన్న వయసులోనే సీఎం అయ్యారు. సీఎంను ఏకవచనంతో పిలిచినందుకు ఎవరైనా బాధపడి ఉంటే నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను’’ అని కేటీఆర్ అన్నారు.