తెలంగాణవీణ జాతీయం : సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లు.. లైక్స్ కోసం యువత ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతున్నారు. ప్రమాదమని తెలిసినా నడిరోడ్లు, రైలు పట్టాలు, ఎత్తైన ప్రాంతాల్లో రీల్స్ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా సెంట్రల్ రైల్వే రీల్స్ గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. రైల్వే స్టేషన్లో ప్రమాదకర స్టంట్లు చేయడం మానుకోవాలని అవగాహన కల్పిస్తూ ఆ యువకుడికి సంబంధించిన ఘటనను పోస్ట్ చేసింది.
అందులో కదులుతున్న రైలును మస్జిత్ షా యువకుడు రెండు చేతులతో పట్టుకొని స్టంట్లు చేస్తూ కనిపించాడు.అలా చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒక కాలు, చేయి కోల్పోయాడని తెలుపుతూ యువకుడికి సంబంధించిన క్లిప్‌ను రైల్వే పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్ఇటీవల యువకుడి స్టంట్స్ వీడియో వైరల్‌గా మారడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారని, అదుపులోకి తీసుకోవడానికి వెళ్లగా ఒక కాలు, చేయి కోల్పోయిన స్థితిలో కనిపించాడని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 14న రైల్వే స్టేషన్లో రీల్స్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒక చేయి, కాలు కోల్పోయానని తెలిపాడు.యువత ప్రమాదకర స్టంట్లు చేయకుండా నివారించేందుకు మస్జిత్ షా ఘటన ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ పేర్కొన్నారు. రైళ్లు, రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌లపై ఎవరైనా ఇటువంటి స్టంట్లు చేస్తే వెంటనే 9004410735 లేదా 139 నంబర్‌కు సంప్రదించాలని కోరారు. పోస్ట్ వైరల్‌గా మారడంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘రీల్స్ మాయలో ఎంతో మంది యువత ఇలా ప్రమాదాల బారిన పడుతున్నా..మిగిలిన వారు తమ వైఖరిని మార్చుకోవట్లేదు’ అంటూ ఓ నెటిజన్ స్పందించారు. మరొకరు స్పందిస్తూ ‘ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలి..జైలు శిక్ష విధించాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
https://x.com/Central_Railway/status/1816900693862809769
Tweet