తెలంగాణవీణ జాతీయం : లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ t) పార్లమెంటులో తొలిసారి ప్రసంగించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె.. తమ రాష్ట్రంలో గిరిజన సంగీతం, జానపద కళలు అంతరించిపోతున్నాయన్నారు. సభలో మాట్లాడిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. హిందీలో ప్రసంగించిన కంగన.. మండి ప్రజల తరఫున మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు స్పీకర్‌కు తొలుత కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘మండిలో వివిధ కళారూపాలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. హిమాచల్‌లో కత్-కుని అనే హస్తకళ ఉంది. గొర్రె చర్మాన్ని జాకెట్లు, టోపీలు, శాలువాలు, స్వెటర్లు వంటి పలు రకాల దుస్తుల తయారీకి వినియోగిస్తారు. వీటికి విదేశాల్లో ఎంతో విలువ ఉన్నా.. ఇక్కడ మాత్రం అంతరించిపోతున్నాయి. అందువల్ల, వీటికి ప్రోత్సాహమిచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించాల్సిన అవసరం ఉంది. హిమాచల్‌లో జానపద సంగీతం, మరీ ముఖ్యంగా స్పితి, కిన్నౌర్, భర్మౌర్‌లోని గిరిజన సంగీతం, వారి జానపదం, కళారూపాలు కూడా అంతరించిపోతున్నాయి.’’ అని ప్రసంగంలో పేర్కొన్నారు.