తెలంగాణవీణ జాతీయం : చేపల వేటకు వెళ్లిన బోటుపై ఓ భారీ తిమింగళం దాడిచేసింది. దీంతో బోటు బోల్తాపడగా అందులోని ఇద్దరూ సముద్రంలో పడిపోయారు. ఆ తర్వాత వారిని కొందరు రక్షించారు. అమెరికాలోని న్యూహాంప్‌షైర్ వద్ద ప్రోట్స్‌మౌత్ హార్బర్ సముద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.23 అడుగుల పొడవుండే బోటుతో కొందరు వ్యక్తులు చేపల వేటకు వెళ్లారు. అదే సమయంలో ఓ భారీ తిమింగలం బోటు సమీపానికి వచ్చింది. దీంతో సమీపంలోనే మరో బోటులో ఉన్న ఇద్దరు వ్యక్తులు దానిని వీడియో తీస్తుండగా ఊహించని ఘటన జరిగింది. తిమింగలం ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి బోటుపై దాడిచేసింది. దీంతో ఆ బోటు బోల్తాపడింది. దీనిని ముందే ఊహించిన ఓ వ్యక్తి సముద్రంలో దూకేయగా, మరొకరు తిమింగలం దాడితో నీటిలో పడిపోయాడు. వెంటనే సమీపంలోని వ్యక్తులు కొందరు వారిని రక్షించారు.