Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌లివే.. భారత్‌ ఏ స్థానంలో ఉందంటే..?

Must read

తెలంగాణవీణ జాతీయం : ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ కలిగిన దేశాల జాబితాను హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ అనే సంస్థ విడుదల చేసింది. అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది. ఇందులో గతంలో పోలిస్తే భారత్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుంది. తాజా జాబితాలో మన పాస్‌పోర్ట్‌ 82వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మన దేశం 85వ స్థానంలో ఉండటం గమనార్హం.సెనెగెల్‌, తజకిస్థాన్‌ దేశాలతో కలిపి భారత్‌ ఈ ర్యాంకింగ్‌ను పంచుకుంది. మన పాస్‌పోర్ట్‌తో ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్‌ వంటి ప్రపంచంలోని 58 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం చేయొచ్చు. గతంలో ఈ సంఖ్య 59 ఉండగా.. ఇప్పుడు స్వల్పంగా తగ్గింది. ఇక, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో సింగపూర్‌ అగ్ర స్థానంలో నిలిచింది. ఆ దేశ పాస్‌పోర్ట్‌తో 195 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చని నివేదిక తెలిపింది.ఫ్రాన్స్‌, ఇటలీ, జర్మనీ, స్పెయిన్‌, జపాన్‌ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌లతో 192 దేశాలకు వీసా రహిత ప్రయాణం చేయొచ్చు. ఆ తర్వాత ఆస్ట్రియా, ఫిన్‌లాండ్‌, ఐర్లాండ్‌, లగ్జెంబర్గ్‌, నెదర్లాండ్స్‌, దక్షిణ కొరియా, స్వీడన్‌ పాస్‌పోర్టులు మూడో స్థానం దక్కించుకున్నాయి. వీటితో 191 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. 186 దేశాలకు వీసా రహిత ప్రయాణంతో అమెరికా ఈ జాబితాలో 8వ స్థానం దక్కించుకుంది.ఇక మన పొరుగు దేశం పాకిస్థాన్‌ 100వ స్థానంలో ఉంది. ఆ దేశ పాస్‌పోర్ట్‌తో 33 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. జాబితాలో అట్టడుగున 103వ స్థానంలో అఫ్గానిస్థాన్‌ ఉంది. ఆ దేశ పాస్‌పోర్ట్‌ కలిగినవారు 26 దేశాలకు వీసా రహిత ప్రయాణాలు చేయొచ్చని హెన్లీ పాస్‌పోర్ట్‌ఇండెక్స్‌ నివేదిక వెల్లడించింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you