తెలంగాణవీణ జాతీయం : హానర్ భారత్‌లో మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. హానర్ 200 5జీ (Honor 200 5G), హానర్ 200 ప్రో (Honor 200 5G Pro) 5జీ పేరిట వీటిని తీసుకొచ్చింది. ఈ రెండింటి మధ్య ప్రాసెసర్‌లో వ్యత్యాసం ఉంది. ఇవి సిలికాన్ బ్యాటరీతో వస్తున్నాయి. ఫీచర్లు, ధర, వేరియంట్ల వంటి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.హానర్ 200 ప్రో 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
120Hz రీఫ్రెష్ రేటు, 4,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.78 అంగుళాల అమోలెడ్ క్వాడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3, ఆర్‌ఎఫ్ ఎన్‌హ్యాన్స్‌డ్ చిప్ హానర్ సీ1+ ప్రాసెసర్‌అడ్రెనో 735 గ్రాఫిక్స్‌ఆండ్రాయిడ్ 14 ఆధారిత మ్యాజిక్‌ఓఎస్8.050MP సూపర్ డైనమిక్ హెచ్9000 సెన్సర్ పోట్రెయిట్ మెయిన్ + 50MP సోనీ ఐఎంఎక్స్856 టెలీఫొటో + 12MP అల్ట్రావైడ్ అండ్ మ్యాక్రో ట్రిపుల్ కెమెరా సెటప్50MP సెల్ఫీ కెమెరా100W సూపర్‌ఛార్జ్/ 66W వైర్‌లెస్ సూపర్‌ఛార్జ్ ప్రోసపోర్ట్‌తో5,200mAhబ్యాటరీ
5జీ, వైఫై, బ్లూటూత్ 5.3, ఓటీజీ, జీపీఎస్, ఏజీపీఎస్, గ్లోనాస్, బైడూ, గెలీలియో, యూఎస్‌బీ టైప్-సి కనెక్టివిటీ ఫీచర్లు
ఓషియన్ సియాన్, నలుపు రంగుల్లో అందుబాటులో ఉంది.
హానర్ 200 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
120Hz రీఫ్రెష్ రేటు, 4,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.7 అంగుళాల అమోలెడ్ క్వాడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్
అడ్రెనో 720 గ్రాఫిక్స్
ఆండ్రాయిడ్ 14 ఆధారిత మ్యాజిక్‌ఓఎస్ 8.0
50MP సోనీ ఐఎంఎక్స్906 వైడ్ + 50MP సోనీ ఐఎంఎక్స్856 టెలీఫొటో + 12MP అల్ట్రావైడ్ అండ్ మ్యాక్రో ట్రిపుల్ కెమెరా సెటప్
50MP సెల్ఫీ కెమెరా
100W సూపర్‌ఛార్జ్/ 66W వైర్‌లెస్ సూపర్‌ఛార్జ్ ప్రో సపోర్ట్‌తో 5,200mAh బ్యాటరీ
5జీ, వైఫై, బ్లూటూత్ 5.3, ఓటీజీ, జీపీఎస్, ఏజీపీఎస్, గ్లోనాస్, బైడూ, గెలీలియో, యూఎస్‌బీ టైప్-సి కనెక్టివిటీ ఫీచర్లు
మూన్‌వైట్, నలుపు రంగుల్లో అందుబాటులో ఉంది.
హానర్ 200 సిరీస్ ధరలు..
హానర్ 200 5జీ (Honor 200 5G Price)
8GB + 256GB – Rs.34,999
12GB + 512GB – Rs.39,999
హానర్ 200 ప్రో 5జీ (Honor 200 Pro 5G Price)
12GB + 512GB – Rs.57,999
జులై 20 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. 20, 21న జరగనున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంక్ కార్డుల ద్వారా రూ.3,000 వరకు రాయితీ కూడా ఉంది. కొన్ని షరతులకు లోబడి కస్టమర్లు అదనంగా మరో రూ.8,000 తక్షణ తగ్గింపును కూడా పొందొచ్చు. రూ.8,499 విలువ చేసే హానర్ యాక్సెసరీస్‌ను కూడా ఉచితంగా పొందొచ్చు. ఇవన్నీ కలిపితే ఫోన్ ధర భారీగానే తగ్గుతుంది. అమెజాన్ ఇండియా వెబ్‌సైట్ సహా హానర్ ఈ-స్టోర్‌లో ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి