తెలంగాణవీణ జాతీయం : ఇటీవల జింబాబ్వే పర్యటనలో అదరగొట్టిన టీమ్ఇండియా యువ ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చారు. జింబాబ్వేతో చివరి మూడు టీ20లే ఆడి 165.88 స్ట్రైక్‌రేట్‌తో 141 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానంలో నిలిచాడు. శుభ్‌మన్ గిల్ ఏకంగా 36 స్థానాలు ఎగబాకి 37వ స్థానం దక్కించుకున్నాడు. జింబాబ్వే టూర్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన గిల్ ఐదు మ్యాచ్‌ల్లో కలిపి 170 పరుగులు చేశాడు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్‌తో కలిసి రెండో స్థానాన్ని పంచుకుంటున్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 36 స్థానాలు జంప్ అయి 46వ స్థానానికి చేరుకున్నాడు. పేసర్ ముకేశ్ కుమార్ 21 స్థానాలు ఎగబాకి 73వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఈ విభాగంలో ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ మొదటి స్థానంలో ఉన్నాడు.ఇటీవల వెస్టిండీస్‌తో లార్డ్స్‌లో జరిగిన మొదటి టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు జేమ్స్ అండర్సన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. వారం తిరగకముందే మళ్లీ ఇంగ్లాండ్ జట్టులో చేరాడు. అయితే, ఆటగాడిగా కాదు మెంటార్‌గా. వెస్టిండీస్‌తో మిగిలిన రెండు టెస్టు మ్యాచ్‌లకు అండర్సన్ ఇంగ్లిష్ జట్టుకు బౌలింగ్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఇంగ్లాండ్, విండీస్ మధ్య జులై 10 – 14 మధ్య రెండో టెస్టు నాటింగ్‌హామ్‌లో జరగనుంది.